విజయవాడ : ఏపీఎస్ఆర్టీసీలోకి కొత్తగా 2,736 బస్సులు తీసుకోనున్నామని ఎండీ
ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 1,500 డీజిల్ బస్సులు కొనుగోలు
చేయనున్నామని, 1,000 విద్యుత్తు బస్సులు జీసీసీ విధానం(అద్దె ప్రాతిపదికన),
200 పాత డీజిల్ బస్సులను ప్రయోగాత్మకంగా విద్యుత్తు రెట్రోఫిటింగ్
(విద్యుత్తు బస్సులుగా) మార్పు చేస్తామని, మిగిలిన 36 అద్దె ప్రాతిపదికన
తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రెట్రోఫిటింగ్కు కేంద్ర ప్రభుత్వం సాయం
అందిస్తుందని వెల్లడించారు. కర్ణాటక ఆర్టీసీ అంబారీ ఉత్సవ్ పేరిట 15 మీటర్ల
పొడవుంటే బస్సులను ఇటీవల ప్రవేశపెట్టిందని, ఏపీఎస్ఆర్టీసీకి కూడా అటువంటివి
తీసుకోనున్నట్లు తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలుకు రూ.572 కోట్ల
వ్యయమవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా
ఆర్టీసీలతో అంతర్రాష్ట్ర ఒప్పందం పూర్తయిందని, త్వరలో తెలంగాణ, తమిళనాడు
ఆర్టీసీలతో కూడా ఒప్పందాలు చేసుకొని, ఏ రాష్ట్రంలో ఎన్ని కి.మీ. మేర తిరగొచ్చు
అనేది తేలాక బస్సుల సంఖ్య పెంచుతామని ఎండీ వివరించారు.