విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతనముగా ఆధునిక
సాంకేతికతతో (నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించుటకు) యూనిఫైడ్ టికెటింగ్
సొల్యూషన్ ప్రవేశపెట్టింది . ఇప్పటికే సంస్థలో దాదాపు 65శాతం సర్వీసులు
యుటిఎస్వి ధానములోనికి మార్చబడినవి. ఈ సందర్భముగా యుటిఎస్ కు సంబంధించి డిపో
స్థాయిలో కండక్టరు / డ్రైవరు ఈ పోస్ మెషిన్ ను ఉపయోగించు విధి విధానాలను,
పాటించవలసిన నియమ నిభంధనలను చేతి పుస్తక రూపములో పొందుపరిచారు. చేతి
పుస్తకమును సంస్థ ఉన్నతాధికారుల సమక్షములో ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్
డైరెక్టరు ద్వారకా తిరుమల రావు ఆవిష్కరించారు. సదరు పుస్తకము, సంస్థ యందు
ఉన్న దాదాపు 40,000 మంది సిబ్బందికి పంపిణీ చేయబడును. ఈ సందర్భముగా వైస్
చైర్మస్& మేనేజింగ్ డైరెక్టరు మాట్లాడుతూ సంస్థలోని సిబ్బంది అందరు ఈ యుటిఎస్
చేతి పుస్తకమును వినియోగించుకొని సంస్థ అభివృద్దికి, ఆధునిక సౌకర్యములు
కల్పించుటకు సహరించాలని కోరారు.
యు టి ఎస్ విధానము ప్రవేశ పెట్టుట ద్వారా ప్రయోజనాలు : కాగిత రహిత బస్ పాస్
సదుపాయము. ప్రయాణికులకు ఒకే యాప్ నందు ముందస్తు టికెట్ బుక్ చేసుకొనుట,
బస్సులు గమనములు, సరుకు రవాణా వివరములు తెలుసుకొనుట, గ్రామీణ ప్రాంత బస్సుల
టికెట్స్ కొనుగోలు చేయుట. ప్రయాణికులు నగదు ద్వారానే కాకుండా యూపీఐ, డెబిట్
కార్డ్, క్రెడిట్ కార్డ్, వాలెట్, ఇతర కార్డ్ ల ద్వారా టికెట్లను కొనవచ్చు.
క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా టికెట్స్ కొనవచ్చు.