చెన్నై : రాష్ట్రంలో ఆర్థికపరంగా, పారిశ్రామికపరంగా అభివృద్ధిని సాధించడమే
డీఎంకే ద్రావిడ పాలన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
పేర్కొన్నారు. నుంగంబాక్కంలో జరిగిన ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ సదరన్
ఇండియా (ఎఫ్‌సీ) శతవార్షికోత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
ప్రసంగిస్తూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికే ద్రావిడ తరహా
పాలన అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి కార్మికోద్యమం
ఆవిర్భవించిందన్నారు. బ్రిటి్‌షవారు ఈ ప్రాంతంలోనే విరివిగా కర్మాగారాలు
నెలకొల్పారని, ఆ కర్మాగారాల్లోని కార్మికులంతా ఉద్యమాలు జరిపి తమ హక్కులను,
రాయితీలను సాధించారని గుర్తు చేశారు. 1905లో తూత్తుకుడిలో హార్వే కర్మాగారంలో
వా.వు. చిదంబరనార్ ట్రేడ్ యూనియన్ స్థాపించారని, ఆ స్వాతంత్య్ర సమరయోధుడి
జయంతి రోజున ఫెడరేషన్ శతవార్షికోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించడం
ప్రశంసనీయమన్నారు. తూత్తుకుడి ఓడరేవు, తూత్తుకుడి హార్వే కర్మాగారం,
చెన్నైలోని బకింగ్‌హామ్ కర్నాటిక్ మిల్లులో కార్మికులు తమ హక్కుల కోసం
పోరాడి రాయితీలు, అనుకూలమైన చట్టాలు పొందగలిగారని తెలిపారు. మరో వైపు
పారిశ్రామికవేత్తలు కూడా కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించేదందుకు, వారి
వ్యాపారాలను విస్తరించారని, అలా ఆవిర్భవించిందే ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్
సదరన్ ఇండియా (ఎఫ్‌సీ) అని చెప్పారు. ప్రస్తుతం పది లక్షల మందికిపైగా సభ్యులు
కలిగిన ఈ ఫెడరేషన్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుం డడం
అభినందనీయమన్నారు. గత పదిహేనునెలల పాలనలో కొత్త పరిశ్రమలను నెలకొల్పి, దేశ,
విదేశాల నుంచి పెట్టుబడులను సమీకరించామని సీఎం పేర్కొ న్నారు.. ఈ సభలో
మంత్రులు కేఎన్ నెహ్రూ, సీవీ గణేశన్, కార్మిక సంక్షేమ శాఖ అదనపు ప్రధాన
కార్యదర్శి నజీముద్దీన్, ఎఫ్‌సీ చైర్మన్ ఆర్.శ్రీకాంత్ తదితరులు
పాల్గొన్నారు.