ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆళ్ల నానిని క్యాంపు
కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలు నియోజక వర్గాల
నాయకులు
సంక్షేమ పాలనను ప్రజలకు మరింత చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆళ్ల నాని
ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులుగా నియమించబడిన రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల
కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) కి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అభినందనలు
వెల్లువెత్తాయి. మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో కార్యకర్త నుంచి రాష్ట్ర
ఉపముఖ్యమంత్రి స్థాయి వరకు చేరిన ఆళ్ల నానికి వివాద రహితుడిగా, ధీటైన
నాయకుడుగా మంచి పేరు ఉంది. దివంగత మహానేత డా.వైఎస్సార్ కి అనుంగు శిష్యుడిగా ,
2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తొలిసారి ఏలూరు ఎమ్మెల్యే గా ఆళ్ల నాని
ఎన్నికయ్యారు. 2009లో మరోసారి ఏలూరు ఎమ్మెల్యే గా గెలిచి ప్రజలకు మరింత
చేరువయ్యారు.
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న కుటిల
రాజకీయ కుట్రల నేపధ్యంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల నాని మాట
తప్పని -మడమ తిప్పని యువనేత వైఎస్. జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగులు వేశారు.
పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులుగా పార్టీకి విశేష
సేవలు అంధించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా
వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు నడిపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తొలి క్యాబినెట్ లో రాష్ట్ర
ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా కీలక భాద్యతలు నిర్వర్తించారు.
మాటలు చెప్పటం కంటే చేసి చూపటానికే అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే ఆళ్ల నాని
పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు.
ఈ నేపథ్యంలో ఇటీవల వైయస్సార్ సిపి అధ్యక్షులు ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి గారు ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆళ్ల
నానిని నియమించిన సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి
నాయకులు ,కార్యకర్తలు ఏలూరు క్యాంపు కార్యాలయంకు చేరుకుని ఆళ్ల నానికి
శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.రానున్న రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రి గా
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో విజయం అందించటానికి ఆళ్ల నాని
సూచనల మేరకు తామంతా పార్టీకి సేవలు అంధించటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని
తెలిపారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా లోని 7నియోజకవర్గాల్లో బూత్ లెవల్ లో పార్టీని
బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు చొరవ చూపాలని, 2024 ఎన్నికల్లో అత్యధిక
మెజారిటీతో మరోసారి జగనన్న ను ముఖ్యమంత్రి ని చేయటానికి అందరూ సమిష్టి కృషి
చేయాలని అన్నారు.
జిల్లాలోని కార్యకర్తల సంక్షేమం కోసం కృషిచేస్తానని ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు
కార్పొరేషన్ 40వ డివిజన్ కి చెందిన వైఎస్సార్ సిపి నాయకులు కార్పొరేటర్
తుమరాడా స్రవంతి ఆధ్వర్యంలో ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిసి భారీ పుష్ప
గుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర డిప్యూటీ మేయర్లు గుడిదేసి
శ్రీనివాస్, నూకపెయ్యి సుదీర్ బాబు, వైఎస్సార్ సిపి నాయకులు సామంతుల లక్ష్మణ్
రావు, నూజివీడు నియోజకవర్గ నాయకులు రామిశెట్టి మురళి కృష్ణ కుమార్, పామర్తి
రాధా కృష్ణ,పగడాల చక్రధర్ రావు , ఏలూరు 40 వ డివిజన్ వైఎస్సార్ సిపి నాయకులు
సహా జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పెద్ద
ఎత్తున పాల్గొన్నారు.