నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి
కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేసిన ఆయన..
వారికి ఇళ్లకు సంబంధించిన పట్టాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఇవాళ మహోత్తర ఘట్టం ఆవిష్కృతమైంది.
సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌లో నిర్మించిన.. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ
సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీంతో ఒకే
ప్రాంగణంలో 15,660 ఇళ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు.
కొల్లూరులో ప్రభుత్వం నిర్మించిన భారీ రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ఆయన
ప్రారంభించారు. రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ గృహ
సముదాయానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. బ్యాటరీ వెహికిల్‌లో
వెళ్తూ గృహ సముదాయం పరిసరాలను సీఎం పరిశీలించారు. రెండు పడక గదుల ఇళ్ల
నిర్మాణం వేగవంతంపై ప్రభుత్వం దృష్టి
అనంతరం ఆరుగురు లబ్ధిదారులతో కేసీఆర్ స్వయంగా గృహ ప్రవేశం చేయించారు.
పటాన్చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను ఇద్దరి చొప్పున
అధికారులు ఎంపిక చేయగా.. వారితో కలిసి సీఎం గృహ ప్రవేశం కార్యక్రమంలో
పాల్గొన్నారు. వీరిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుడితోపాటు ఒకరు
సాధారణ కేటగిరికి చెందిన వారు ఉన్నారు.
కొల్లూర్‌లోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయం ప్రత్యేకతలు
145ఎకరాల విస్తీర్ణంలో రూ.1450 కోట్లు ఖర్చు చేసి 15,660 ఇండ్ల నిర్మాణం117
బ్లాకులుగా నిర్మించిన గృహ సముదాయంలో ఒక్కో బ్లాకులో 8 నుంచి 11
అంతస్తులుప్రతి ప్లాట్‌కు గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ప్రత్యేక
జాగ్రత్తలుప్రతి బ్లాక్‌కు రెండు లిఫ్ట్‌లు, రెండు లేదా మూడు మెట్ల మార్గాల
ఏర్పాటుమొత్తం విస్తీర్ణంలో కేవలం 14 శాతమే భవనాల నిర్మాణానికి వినియోగం.23
శాతం రోడ్లు, డ్రైనేజీల కోసం 25 శాతం పార్కులు, ఆట స్థలాల కోసం వినియోగం38
శాతం భూమిని భవిష్యత్ సామాజిక అవసరాల కోసం కేటాయించారు. మరోవైపు పదమూడున్నర
కిలోమీటర్ల పొడవైన అంతర్గత రోడ్లను నిర్మించారు. 10.6 కిలోమీటర్ల పొడవైన
భూగర్భ డ్రైనేజీ పైపులైను ఇప్పటికే వేశారు. 15,660 కుటుంబాలు ఒకే ప్రాంగణంలో
నివాసం ఉండటంతో పెద్దఎత్తున నీటి వసతి అవసరం అవుతుంది. ఇందుకోసం 21,000 కిలో
లీటర్ల సామర్థ్యంతో మంచినీటి ట్యాంకులు నిర్మించారు. మూడు దుకాణ సముదాయాలు,
బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం వంటి వాటిని సైతం
ఏర్పాటు చేయనున్నారు.
మొత్తం రెండు పడక గదుల నిర్మాణ ప్రాంగణంలో 30,000 మొక్కలు నాటారు. మురుగు
నీటిని శుద్ధి చేసి.. మొక్కలు, ఇతర అవసరాల వినియోగించుకునేలా 9మిలియన్ల లీటర్ల
సామర్థ్యంతో ఎస్టీపీ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ
అవార్డులు సొంత చేసుకున్న ఈ భారీ గృహ సముదాయానికి కేసీఆర్నగర్గా నామకరణం
చేశారు.