ఆస్కార్ అవార్డుల సందడి పార్లమెంటును కూడా తాకింది. ఆర్ఆర్ఆర్, ఎలిఫెంట్
విస్పరర్స్ సినిమాలకు అవార్డులు దక్కడంపై రాజ్యసభ హర్షం వ్యక్తం చేసింది. ఇదే
సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన
వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూశాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లే సభ..
కొద్దిసేపు చల్లబడింది.రెండు సినిమాలకు ఆస్కార్ అవార్డులు రావడంపై రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే
మాట్లాడారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఇది దేశానికే
గర్వకారణమన్నారు. అయితే ఇదే సమయంలో మోదీని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.
‘‘మనకు ఇది గర్వకారణం. అయితే ఆస్కార్ అవార్డుల క్రెడిట్ ను అధికార పార్టీ
తీసుకోవద్దు ప్లీజ్.. నా ఏకైక అభ్యర్థన ఇది. ‘మేమే దర్శకత్వం వహించాం.. మేమే
రచించాం.. మోదీజీ దర్శకత్వం వహించారు’ అని చెప్పొద్దు’’ అని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలతో సభలో ఉన్న వారంతా నవ్వేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులతోపాటు
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్, కేంద్ర మంత్రులు జైశంకర్, పియూష్ గోయల్,
మాండవీయ తదితరులంతా నవ్వుతూ కనిపించారు.