హైదరాబాదీ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా తన కెరీర్ లో చివరి
గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలి యన్ ఓపెనే అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ
టోర్నీ తర్వాత ఆమె టెన్నిస్ కు గుడ్ బై చెప్పనుంది. ఇప్పుడీ గ్రాండ్‌స్లామ్
ఉమెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో సానియా విజయం సాధించింది. తన డబుల్స్ భాగస్వామి
ఏనా డానిలినాతో కలిసి బరిలోకి దిగిన సానియా.. అమెరికా, హంగరీ జోడీ
బెర్నార్నాడా పెరా, డాల్మా గల్ఫీపై 6-2, 7-5 తేడాతో వరుస సెట్లలో గెలిచింది.
ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ లో సానియా, డానిలినా జోడీ 8వ సీడ్ గా
బరిలోకి దిగింది. తొలి సెట్ ను వీళ్లిద్దరూ కేవలం 25 నిమిషాల్లోనే 6-2తో
గెలుచుకున్నారు. తొలి సెట్ లో సానియా తన ఫోర్ హ్యాండ్ షాట్లతో చెలరేగింది.
రెండో సెట్ లోనూ మొదట్లోనే రెండు బ్రేక్స్ సాధించి 4-1 ఆధిక్యంలోకి
దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత తడబడింది. ఆరో గేమ్ లో సానియా డబుల్ ఫాల్ట్ తో
ప్రత్యర్థి జోడీ మళ్లీ పుంజుకుంది. అయితే చివరికి 7-5తో సెట్ తోపాటు మ్యాచ్ ను
కూడా గెలుచుకున్నారు. అలా దాల్మా గల్ఫీ, అమెరికన్ బెర్నార్డా పెరాపై విజయం
సాధించారు.