నలుగురి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
మెల్బోర్న్: పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్
నగరంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ఢీకొట్టుకున్న ఈ
ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ల్యాండ్
అవుతున్న హెలికాప్టర్, టేకాఫ్ అవుతున్న హెలికాప్టర్ పరస్పరం ఢీకొనడంతో ఈ
ప్రమాదం జరిగిందని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర పోలీసు అధికారి తెలిపారు. ఒక
చాపర్ క్షేమంగా ఇసుకపై అత్యవసర ల్యాండింగ్ చేయగా మరొకటి తీవ్రంగా ధ్వంసమై
నేల మీద పడిపోయింది. ప్రమాద తాకిడికి హెలికాప్టర్ ప్రధాన భాగం తిరగబడిపోయి,
శకలాలు చెల్లాచెదురుగా ఆ ప్రాంతమంతా విస్తరించాయి. కూలిపోయిన హెలికాప్టర్లో
ఉన్నవారే మృతులుగా, క్షతగాత్రులుగా మారారు. మరో హెలికాప్టర్‌లోని ప్రయాణికులకు
స్వల్ప గాయాలయ్యాయి.