ప్రతినిధులు
రేపు బ్రిస్బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో జరిగే బోనాలు
వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత, ఆస్ట్రేలియా మంత్రులు,ఎంపీలు
భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం
చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గారికి భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన
స్వాగతం పలికారు. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల నుండి బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి
నాయకులు వందల సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. తెలంగాణ
జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అందెం, బీఆర్ఎస్
ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, BTA ప్రెసిడెంట్
కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి రెడ్డి, ఇతర నాయకులు
ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. రేపు ఉదయం 10 గంటలకు బ్రిస్బేన్ లోని
గాయత్రి మందిరంలో జరగనున్న బోనాలు వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, ఆస్ట్రేలియా
మంత్రులు, ఎంపీలు పాల్గొననున్నారు.