కోక్రాన్ డేటాబేస్ ఆఫ్ సిస్టమాటిక్ రివ్యూస్ వెల్లడి
విటమిన్ డి అనేది ఎముకల ఆరోగ్యానికి, కాల్షియం జీవక్రియకు దోహదపడే
సూక్ష్మపోషకం. మునుపటి కోక్రాన్ సమీక్ష విటమిన్ డి ఆస్తమా ప్రకోపణల
ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని సూచించింది. కానీ 2023 కోక్రాన్ సమీక్ష
నుంచి వచ్చిన డేటా విటమిన్ డి ఆస్తమా ప్రకోపణల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం
చేయదని సూచిస్తుంది. సమీక్ష ఫలితాలను నిర్ధారించడానికి తదుపరి పరిశోధన అవసరం
అవుతుంది.
నిజానికి విటమిన్ డి అనేది ఆరోగ్యానికి కీలకమైన పోషకం. విటమిన్ డి
పూర్తి ప్రయోజనాలను, విటమిన్ తీసుకోవడం ఆరోగ్యానికి సంబంధించిన వివిధ రంగాలను
ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ఇప్పటికీ కృషి
చేస్తున్నారు. ఇంతకుముందు విటమిన్ డి ఆస్తమా దాడుల నుంచి రక్షించడంలో
సహాయపడుతుందని పరిశోధకులు భావించారు. అయినప్పటికీ కోక్రాన్ డేటాబేస్ ఆఫ్
సిస్టమాటిక్ రివ్యూస్‌లో ప్రచురించబడిన తాజా సమీక్షలో విటమిన్ డి తీసుకోవడం
ఆస్తమా లక్షణాలను మెరుగుపరచడంలో, లేదా ఆస్తమా దాడుల ప్రమాదాన్ని తగ్గించడంలో
సహాయపడదు.