ప్రొటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉండదు. అయితే రోజూ మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలన్న విషయం ఏజ్, జెండర్, బరువు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ కీలకం. ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని భాగాలను ధృఢంగా ఉంచేందుకు, కండరాల కణజాలాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. కనిష్టంగా చురుకైన పెద్దల్లో లోపాన్ని నివారించడానికి ప్రస్తుతం సిఫార్సు చేయబడిన ఆహార భత్యం కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. అయితే కండరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు దీని కంటే ఎక్కువ అవసరమని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. అసలు అవసరాల కంటే తక్కువ ప్రోటీన్ తీసుకోవడం కండర ద్రవ్యరాశిని తగ్గిస్తుంది. దీనికి విరుద్ధంగా వ్యాయామంతో జత చేసినప్పుడు ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం బలం, సన్నని శరీర ద్రవ్యరాశిని పెంచడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 2,000 కేలరీలు తినే వ్యక్తి రోజుకు 50 నుంచి 175 గ్రాముల ప్రోటీన్ తినవలసి ఉంటుంది. అందుకే పిల్లలైనా, పెద్దలైనా పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. రోజూ తినే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మంచి కొవ్వు, మినరల్స్, కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. శరీరం సక్రమంగా పనిచేయడానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. ముఖ్యంగా ప్రోటీన్లు మన శరీరానికి ఎన్నో విధాలా సహాయపడతాయి. ఇది మన శరీర ఎదుగుదలకు సహాయడుతుంది. అలాగే కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఎముకలను, కండరాలను బలంగా ఉంచడానికి సహాయపడతుంది. శరీరం సక్రమంగా పనిచేసేందుకు ప్రోత్సహిస్తుంది. అంటే హార్మోన్ల విధులు సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.