ఓ నటిగా నా కల నిజమైనట్లుంది. రజనీకాంత్, చిరంజీవి లాంటి ఇద్దరు అగ్ర హీరోలతో
కలిసి ఒకేసారి అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం గొప్ప అనుభూతిని
కలిగిస్తోంది అంటోంది తమన్నా. ఆమె ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్లో’ చిరంజీవితో
‘భోళా శంకర్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఈ నెల 10, 11
తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తమన్నా
విలేకర్లతో మాట్లాడుతూ ‘సైరా’లో నాకు చిరంజీవితో కలిసి నటించే అవకాశం
దొరికింది. కానీ, డ్యాన్స్ చేయలేకపోయా. ఇప్పుడది ‘భోళా శంకర్’ తో ఆ కోరిక
నెరవేరింది . ‘జైలర్’ చిత్రం విషయానికొస్తే.. అందులో నా పాత్ర చిన్నదే. కానీ,
భారీ తారాగణముంది. నా 18ఏళ్ల సినీ ప్రయాణంలో ఇటు అగ్ర హీరోలతోనూ…అటు యువ
హీరోలతోనూ అందరితో కలిసి పని చేశా. అయితే నేనెవరితో కలిసి పని చేసినా వారి
వయసును ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోను. అందర్నీ నటులుగానే చూస్తా. మేము చేసే
పాత్రలు ప్రేక్షకుల్ని అలరించేలా ఉన్నాయా? లేదా? అన్నదే ఆలోచిస్తా” అని
చెప్పింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు “నేనేదైనా ముక్కు సూటిగానే
మాట్లాడతా. ప్రేమ విషయాన్ని నాకు నేనుగానే బయట పెట్టా. అలాగే పెళ్లి సమయం
వచ్చినప్పుడు ఆ విషయాన్ని నేనే స్వయంగా వెల్లడిస్తా, ఇప్పటికైతే అలాంటి
ప్రణాళికలేమి లేవు” అని చెప్పింది తమన్నా.