విజయవాడ : రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. ‘‘మత విద్వేషం ప్రదర్శించే బీజేపీతో మేము రాజీలేని పోరాటం చేస్తాం. బీజేపీతో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది.. అలాగే బీజేపీతో అక్రమ, అనైతిక బంధంలో వైఎస్సార్సీపీ ఉంది.. ఏపీలో ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా పార్టీలతో కలిసి పోరాడతాం’’ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ తన ట్విట్టర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.