బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో తన అందం అభినయంతో ఆకట్టుకుంది మలయాళ నటి
హనీ రోజ్. ఆమె ఇప్పుడు మరో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి
ముస్తాబవుతోంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాచెల్’ ఆనందిని బాలా ఈ
సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని హనీ రోజ్
ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ
త్వరలో రాబోతున్న సినిమాలో నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నాను.
‘రాచెల్’ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని వ్యాఖ్యల్ని జోడించింది
హనీరోజ్. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ఈ చిత్రంలో నా పాత్ర ప్రేక్షకులకు
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా సరదాగా ఉంటుంది. తెలుగులో ‘వీరసింహారెడ్డి’
తరువాత మలయాళంలోకి రావడానికి ఇదే సరైన పాత్ర అనుకున్నాను. ఇంతకు ముందు నేను
కొన్ని మహిళా ప్రాధాన్య పాత్రలు చేశాను. కానీ ఇది ఇంకో మెట్టు ఎక్కువగా
ఉంటుంది. మొదటిసారి ఈ కథ విన్నప్పుడు దీనికి ‘నేను మాత్రమే సరిపోతానని
అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ఈ లుక్ లోఆమె చేతిలో పదునైన కత్తిని
పట్టుకొని మాంసాన్ని కొడుతూ కనిపిస్తోంది. ఈ పోస్టర్ లో హనీరోజ్ తన చూపులతో
ప్రేక్షకులను ఆకట్టుకున్నా మరో వైపు నెటిజన్లు ఈ సినిమాను బ్యాన్ చేయాలని
విమర్శల వర్షం కురిపిస్తున్నారు.