ఆదిపురిష్ సినిమాలో జానకిగా మెప్పించిన కృతి సనన్ ఇప్పుడు మరో పాత్రలో
ఒదిగిపోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. దిగ్గజ నటి, దివంగత మీనా కుమారి జీవితం
ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ
ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మేటి నటనతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు, గౌరవం అందుకున్న నటి
మీనాకుమారి. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్ చేస్తుండటంతో.. ఆ పాత్రకు న్యాయం
చేయాలనే పట్టుదలతో కృతి సనన్ విపరీతంగా కష్టపడుతోందని సన్నిహితులు
చెబుతున్నారు. మీనా కుమారి నటనా – శైలిపై అవగాహన పెంచుకోవడానికి ఆమె నటించిన
‘బైజుబావ్రా, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, ‘పాకీజా’ లాంటి క్లాసిక్ చిత్రాల్ని
మళ్లీ మళ్లీ చూస్తోందట. మీనా కుమారి వ్యక్తిగత జీవితానికి ఇందులో ప్రాధాన్యం
ఉండటంతో.. ఆ విషయాలు తెలుసుకోవడానికి కొన్నాళ్లుగా మీనా కుమారి ఇంటర్వ్యూలు
చూడటం.. ఆమె జీవిత చరిత్ర పుస్తకాలు చదవడం చేస్తోంది. ప్రస్తుతం కథ తుది
మెరుగుల్లో ఉన్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో మొదలయ్యే అవకాశాలు
ఉన్నాయి.