తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో జోరు మీదున్నారు హీరోయిన్ రష్మికా
మందన్న. వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా హీరో ధనుష్ కి జోడీగా
నటించనున్నారని టాక్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు, తమిళ,
హిందీ భాషల్లో గత ఏడాది నవంబరులో ఓ సినిమాకి శ్రీకారం జరిగిన సంగతి తెలిసిందే.
సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని
నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మికా మందన్న నటించే అవకాశం ఉందట.
ఈ మేరకు చిత్ర యూనిట్ ఆమెతో చర్చలు జరుపుతోందని టాక్ ఇదే సినిమాలో హీరో
నాగార్జున ఓ కీలక పాత్ర చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం
రష్మిక తెలుగులో ‘పుష్ప 2′, రెయిన్ బో’ చిత్రాలతో పాటు హిందీలో ‘యానిమల్’ మూవీ
చేస్తున్నారు.