బాలీవుడ్ కథానాయిక సోనమ్ కపూర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ
సందేశం హాటాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా వుండి సోనమ్
కపూర్, తన చిత్ర విశేషాలు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్
తో పంచుకుంటారు. తాజాగా ఆమె సామాజిక వేత్త ఎలియనోర్ రూజ్ వెల్ట్ కు సంబంధించిన
ఓ కోట్ ను షేర్ చేశారు. “చిన్నబుద్ది కలిగిన వారు ఎదుటి వ్యక్తుల గురించి
మాట్లాడతారు. ఓ మాదిరిగా ఆలోచించేవారు పరిస్థితుల గురించి మాట్లాడతారు. గొప్ప
మనసు కలిగిన వారు ఆలోచనల గురించి చర్చిస్తుంటారు. ఇది చిన్న విషయమే
అయినప్పటికీ కొంత మంది దీనిని తెలుసుకోవాలనుకుంటున్నా. ముఖ్యంగా ఎదుటివారిపై
వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడేప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటున్నా
అంటూ పోస్ట్ చేశారు ఆమె. దీనిని చూసిన నెటిజన్లు సోనమ్ ఇలా ఎందుకు పోస్ట్
చేసింది అంటూ చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘కింగ్ ఆఫ్ కోడ్రా’ ప్రీ
రిలీజ్ ఈవెంట్ లో రానా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా సోనమ్ ఇలా పోస్ట్ చేసిందని
అంటున్నారు. ‘గతంలో దుల్కర్ నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ కు వెళ్లినప్పుడు
అక్కడ ఓ బీటౌన్ స్టార్ హీరోయిన్ షూట్ మధ్యలో తన భర్తతో ఫోన్ లో షాపింగ్
గురించిమాట్లాడిందని.. ఆమె కోసం దుల్కర్ వెయిట్ చేస్తున్న పట్టించుకోలేదని,
ఆమె ఆ పరిస్థితిలో సరిగ్గా యాక్ట్ చేయకపోతే దుల్కర్ ఆమె కోసం మరోసారి ఆ సీన్స్
లో యాక్ట్ చేయడానికి ముందుకు వచ్చారని’ రానా ఇటీవల ఆ ఫంక్షన్ లో అన్నాడు. ఈ
వ్యాఖ్యలపై మరుసటి రోజు రానా తన క్షమాపణలు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే సోనమ్ ఈ
పోస్ట్ పెట్టడంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.