అమరావతి : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారనుంది. ప్రస్తుతం
థియరీ పరీక్షలు ముగిశాక ప్రాక్టికల్స్ ఉండగా వీటిని ముందుగానే నిర్వహించాలని
ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్15
నుంచి మే10 వరకు రెండు విడతలుగా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల
చేశారు. మే వరకు ప్రాక్టికల్స్ ఉండడంతో ఎంసెట్లాంటి పోటీ పరీక్షలకు
సిద్ధమయ్యేందుకు సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షల షెడ్యూల్ను మార్చాలని కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ విద్యామండలికి
విన్నపాలనిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలని
నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇంటర్ విద్యామండలి ప్రతిపాదనలు పంపింది.