రాపూరు వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్:-మండల అధ్యక్షుడు పొట్టేళ్ల పెంచలస్వామి ఆధ్వర్యంలో పేదలకు అండగా జనసేన పార్టీ-టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించలని.జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి నియోజకవర్గ రాపూరు మండలం లో పేదలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.శనివారం జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలను నిర్వహించారు.రాపూరు మండలం గుండవోలు గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన,టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని,ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.ఈ ప్రభుత్వంలో సామాన్యుడు బ్రతికే పరిస్థితి కనిపించడం లేదని ఆరోపించారు.అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్క ప్రజా ప్రభుత్వం తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల అధ్యక్షుడు పొట్టేళ్ల పెంచలస్వామి, ఉపాధ్యక్షుడు మేకల వేమయ్య తదితరులు పాల్గొన్నారు.