రాపూరు (వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ ) ఇంటింటికి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ చింతామోహన్ రాపూరు లో పర్యటించారు. పట్టణంలోని పలు చిరు వ్యాపారులను కలిసి కాంగ్రెస్ పార్టీ వస్తేచేసే కార్యక్రమాల గురించి కర పత్రాలను రూపంలో తెలియపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానని,బిజెపి పట్ల చంద్రబాబు వైఖరి ఏమిటి రేపు వెంకటగిరి సభలో దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలని,అలాగే కాంగ్రెస్ మన్నారం బెల్ ఫ్యాక్టరీ ని తెచ్చిo దని దానికి చంద్రబాబు ఏమి చేసాడో చెప్పాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ కాలం నాటి నుంచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజాలందరిలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల స్పందన ఉందని తెలిపారు. షర్మిల విషయం పత్రికా విలేకర్లు ప్రస్తావించగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని ఇందులోకి ఎవరైనా రావచ్చు అని సమాధానం ఇచ్చారు.