టీం ఇండియా ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న సమయం లో భారత
క్రికెట్ అభిమానులు ఎంత ఉత్సాహంగా, ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తారో ఇప్పుడు అదే
విధంగా ఇండియన్ సినీ ప్రేమికులు అంతే ఆసక్తిగా, ఉత్కంఠ భరితంగా ఎదురు
చూస్తున్నారు.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు
నాటు పాట ఆస్కార్ అవార్డు కి నామినేట్ అయింది. ఈ నెల 13వ తారీఖున అవార్డుల
వేడుక వైభవంగా జరగబోతోంది.ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల కు పైగా ఆస్కార్
అవార్డుల వేడుక కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తారని అంచనా వేస్తున్నారు.

ఇండియా లో ముఖ్యంగా హైదరాబాదు లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని లైవ్
చూసేందుకు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు.కొన్ని హోటల్స్ మరియు షాపింగ్
సంస్థలు ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాల కోసం బిగ్
స్క్రీన్స్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నాటు నాటు పాట కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియా
గర్వించే విధంగా ఆస్కార్ అవార్డును తీసుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని
సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాటు నాటు పాట ఆస్కార్
దక్కించుకుంటే చూడాలని కోరికతో ఉన్నారు.అది ఎంత వరకు సాధ్యమవుతుంది అనేది
చూడాలి.