ఇండోనేషియా భూకంపంలో మృతుల సంఖ్య 268కి చేరుకుంది. సోమవారం సియాం జుర్
కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం ఆ నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం
చేపట్టిన శిథిలాల తొలగింపుతో 102 మృతదేహాలను వెలికితీశారు. మిగిలినవారి జాడ
తెలియలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 1,083 మంది క్షతగాత్రులయ్యారని,
300 మంది పరిస్థితి విషమంగా ఉందని పశ్చిమ సియాంజుర్ గవర్నర్ రిద్వాన్
వెల్లడించారు. 3 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. అధ్యక్షుడు జోకో విడోడో
మంగళవారం సియాంజుర్ ను సందర్శించారు. భూకంప తీవ్రత 5.6 అయినా.. మర ణాల సంఖ్య
ఇంతలా ఉండడానికి అనేక కారణాలున్నాయని ఇండోనే షియాలోని గడ్డా మడ విశ్వవిద్యాలయం
జియాలజీ అసిస్టెంట్ ప్రొఫె సర్ గాయత్రి మరియాని విశ్లేషించారు. రీజియన్ మొత్తం
జనాభా 2.5 లక్షలు కాగా.. నష్టం ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో 1.75 లక్షల మంది
నివసిస్తున్నారు. ‘ఇండోనేషియాలో భూకంపాలు సాధారణమే. చాలాచోట్ల అందుకు
అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలుంటాయి. కానీ, సియాం జుర్ లో మాత్రం సంప్రదాయ భవనాలను
నిర్మించారు. భూకం పాలను తట్టుకునేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ కారణం
వల్ల వరుస ప్రకంపనలు వచ్చాయి” అని ఆమె అన్నారు.
11 మంది కుటుంబ సభ్యులను కోల్పోయాడు..
భూకంపం సంఘటనలో ఎంజోట్(45)ది హృదయవిదారక పరిస్థితి. అతని కుటుంబానికి చెందిన
11 మంది మరణించారు. అలాగే
అతని కోడలు, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఆసుపత్రిలో వారిని ఎంజోట్
సందర్శించాడు. ప్రస్తుతం అతను ఛిద్రమైన
తన జీవితాన్ని బాగుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.”నా జీవితం అకస్మాత్తుగా
మారిపోయింది..” అంటూ అతను కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంజోట్ తన ఇంటికి సమీపంలోని
కొండల్లో ఆవులను మేపుతున్నప్పుడు భూమి కంపించింది. దీంతో అతను ప్రాణాలతో బయట
పడ్డాడు.