హ్యూస్టన్ : ప్రముఖ ఇండియన్ – అమెరికన్ ఆర్థికవేత్త రాజ్ చెట్టికి
ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయ జార్జ్ లెడ్లీ అవార్డు లభించింది.
ఈయనతోపాటు కొవిడ్ పరీక్ష విధానంపై పరిశోధనలు చేసిన హార్వర్డ్ మెడికల్
స్కూల్ బయాలజీ ప్రొఫెసర్ మైకేల్ స్ప్రింజర్ సైతం ఈ బహుమతికి ఎంపికయ్యారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న రాజ్
చెట్టి ఆర్థిక అసమానతలపై అధ్యయనం చేస్తున్న ఆర్థికవేత్తల బృందానికి
డైరెక్టర్గా కూడా ఉన్నారు. విజ్ఞానశాస్త్రానికి, మానవాళికి గొప్ప సేవలు
అందించిన హార్వర్డ్ కమ్యూనిటీ సభ్యులకు ప్రతి రెండేళ్లకు ఓసారి ఈ అవార్డులు
అందజేస్తారు.

భారత్లోని మా నేపథ్యమే నా పరిశోధనకు బలం : తొమ్మిదేళ్ల వయసులో అమ్మానాన్నలతో
అమెరికాకు వచ్చా. ఢిల్లీ , అమెరికాల మధ్యనే కాదు. మాకు, మా దాయాదులకు మధ్య
కూడా అసమానతలు చూశా. దక్షిణ భారతదేశంలోని అల్పాదాయ కుటుంబాల నుంచి నా
తల్లిదండ్రులు వచ్చారు. ఉన్నతవిద్య వారిద్దరికీ గొప్ప అవకాశాలు కల్పించింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆ రోజుల్లో కుటుంబం నుంచి ఒకరిని ఎంపిక
చేసుకొని మంచి చదువు చెప్పించడం చాలా సాధారణంగా ఉండేది. ఎందుకంటే పిల్లలందరినీ
ఆ స్థాయిలో చదివించే ఆర్థిక స్తోమతలు ఉండేవి కావు. రెండు కుటుంబాల్లోనూ నా
తల్లిదండ్రులు ‘ఆ ఒక్కరు’గా అవకాశాలు పొందారని రాజ్ చెట్టి వివరించారు.