విజయవాడ : జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి బుధవారం ఉదయం 8
గంటలకు విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ ఆలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా కనక దుర్గమ్మను దర్శించుకుంటారు.
అమ్మవారిని అర్చించిన అనంతరం సన్నిధానంలో వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా
పూజలు జరిపిస్తారు. మంగళవారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ
ఆంజనేయస్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.
అనంతరం ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
నారసింహ అనుష్టుప్ యాత్ర ప్రారంభించి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా
విజయవాడకు బయలుదేరారు.