రోజులపాటు శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి మూల
విరాట్‌ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అర్చక స్వాములు
అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ
సుందరంగా అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని
తయారు చేసి భక్తులకు అందించనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శాకాంబరి దేవి
ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి
పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ
శుద్ధ త్రయోదశి శనివారము నుండి ఆషాఢ పౌర్ణమి, సోమవారము వరకు దేవస్థానం నందు
వైభవంగా శ్రీ అమ్మవారి శాకాంబరీ దేవి ఉత్సవముల సందర్బంగా యాగశాల నందు
వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ వైదిక సిబ్బంది, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు
దంపతులు, ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ , ట్రస్ట్ బోర్డు
సభ్యులు పాల్గొని అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములును ప్రారంభించారు. ఇందులో
భాగముగా ఉదయం 8.30 గంటలకు విఘ్నేశ్వర స్వామి వారి పూజ, ఋత్విక్ వరుణ, పుణ్యాహ
వచనము, అఖండ దీపారాధన, అంకురార్పణ కార్యక్రమములు నిర్వహించారు. శాకంబరీ దేవి
ఉత్సవములలో మొదటి రోజు సందర్భంగా శనివారం దేవస్థానం ప్రాంగణములు, శ్రీ
అమ్మవారు, ఉపాలయములలోని దేవతామూర్తులు, ఉత్సవ మూర్తులను ఆకుకూరలు, కూరగాయలుతో
అలంకరించారు. ఈ మూడు రోజులపాటు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ శాకంబరీ దేవి
రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శాకంబరీ ఉత్సవముల సందర్భంగా 3 రోజుల పాటు దేవస్థానం నందు వివిధ
శాఖములతో(ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు) తయారుచేసిన కదంబంను భక్తులకు ప్రసాదంగా
పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ,
కార్యనిర్వాహణాధికారి పాల్గొని భక్తులకు కదoబ ప్రసాదమును పంపిణీ చేశారు. ఈ
కార్యక్రమములలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, చింకా శ్రీనివాస
రావు, బచ్చు మాధవీ కృష్ణ, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక
సిబ్బంది, వేదపండితులు, అర్చకులు, సహాయ కార్యనిర్వాహనాధికారి పి.చంద్రశేఖర్
సిబ్బంది పాల్గొన్నారు.