హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్లుతున్నారు. ఇప్పటికే మూడు
ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ
సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శివ నిర్వాణ
దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా
సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతుండగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ
12’ (వర్కింగ్ టైటిల్), పరశురామ్ డైరెక్షన్లో ‘వీడీ 13’ (వర్కింగ్ టైటిల్)
సినిమాలకు కొబ్బరికాయ కొట్టారు విజయ్. తాజాగా ఇంద్రగంటి – విజయ్ కాంబినేషన్లో
ఓ సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ
నిర్మాత ‘దిల్’ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని టాక్. ఈ మూవీకి
‘జటాయు’ అనే టైటిల్ని పరిశీలిస్తోందట. చిత్రబృందం. ఈ సినిమాలో విజువల్
ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని, ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని
వినికిడి. కాగా ‘గీత గోవిందం’ వంటి హిట్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్
కాంబినేషన్లో ప్రారంభమైన ‘వీడీ 13’ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ – ఇంద్రగంటి కాంబినేషన్
ఆరంభించాలనుకుంటున్నారట ‘దిల్’ రాజు.