వాషింగ్టన్ : దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా విధానాన్ని రద్దు చేసి పుట్టిన
దేశం ప్రాతిపదికపై కాకుండా ప్రతిభ ఆధారంగా సిబ్బందిని నియమించుకోవడానికి
అవకాశమిచ్చే ఈగిల్ చట్టానికి అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మద్దతు
ప్రకటించింది. చట్టబద్ధ ఉపాధికి సమాన అవకాశాల కల్పన బిల్లును ఈగిల్ చట్టంగా,
హెచ్ఆర్ 3648గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)
దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో ఈ వారం ఓటింగ్ జరగనుంది. ఇది కనుక ఆమోదం
పొంది, చట్టరూపం ధరిస్తే అమెరికాలో లక్షలాది వలసదారులకు, ముఖ్యంగా భారతీయ
అమెరికన్లకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్‌కార్డు అంటే అమెరికాలో శాశ్వతంగా
నివాసం ఉండడానికి అనుమతించే అధికార పత్రం. ప్రస్తుతం ఒక్కో దేశానికి నిర్ణీత
సంఖ్య (కోటా)లో గ్రీన్‌కార్డులను జారీచేసే విధానం ఉంది. చిన్న చిన్న దేశాల
నుంచి ఈ కోటాకు తగిన సంఖ్యలో సిబ్బంది అమెరికాకు రావడం లేదు. దీంతో ఆ దేశాల
గ్రీన్‌కార్డు కోటాలు మురిగిపోతున్నాయి. కాగా, భారతదేశం నుంచి అత్యధిక సంఖ్యలో
సాంకేతిక నిపుణులు అమెరికా వెళుతున్నా, కోటా విధానం వల్ల వారికి పరిమితంగానే
గ్రీన్ కార్డులు లభిస్తున్నాయి. ఇక నుంచి కంపెనీల అవసరాల మేరకు వలస
సిబ్బందిని నియమించుకోవడానికి వీలుగా దేశాలవారీ కోటాను తొమ్మిదేళ్ళ వ్యవధిలో
ఎత్తివేయాలని ఈగిల్ బిల్లు ప్రతిపాదిస్తోంది. సదరు సమయంలో ఏ దేశానికీ గ్రీన్
కార్డులను నిరాకరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశిస్తోంది. ఈ
తొమ్మిదేళ్ల కాలంలో అమెరికాకు వలస వచ్చే నర్సులు, వైద్య చికిత్సా సిబ్బందికి
కొన్ని వీసాలను ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చిన
నిపుణులతో పాటు వారి వారి దేశాల్లోనే ఉండిపోయిన కుటుంబసభ్యులకూ వీసాలు ఇస్తారు.