అనకాపల్లి : నర్సీపట్నాన్ని గత పాలకులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి అన్నారు. నర్సీపట్నం బహిరంగ సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ
నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, రూపు రేఖలు
మార్చబోతున్నామన్నారు. ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.
చెప్పిందే చేస్తామని సీఎం అన్నారు. ‘‘రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం
జరుగుతోంది. ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది.
మంచి చేస్తున్నా వారికి చెడే కనిపిస్తుంది. పెన్షన్లపై ఎల్లో మీడియా తప్పుడు
ప్రచారం చేస్తుంది. నిబంధనల ప్రకారం ప్రతీ ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్
చేయాలి. పెన్షన్ వెరిఫికేషన్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు’’ అని సీఎం
మండిపడ్డారు.
అనకాపల్లిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.986 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు
శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ
సభలో మాట్లాడుతూ మీ’ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు
తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ
రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. ‘ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నాం. రాష్ట్రంలో
చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లోమీడియా నిత్యం ప్రభుత్వంపై
బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది.
అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల
ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిపై కూడా అసత్య
ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల
ఉమాశంకర గణేష్ మాట్లాడుతూ సీఎం జగన్‌రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది.
రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో
నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు
సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను
ప్రారంభించి మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర
గణేష్ అన్నారు.