ఇజ్రాయిల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వచ్చారు. మొత్తం 120 స్థానాలకు గాను 65 స్థానాల్లో నెతన్యాహు కూటమి విజయం సాధించింది. ఆ కూటమిలో అతని సొంత పార్టీ లికడ్ పార్టీతో పాటు జియోనిజం, షాస్ అటిడ్, యునైటెడ్ టారా జుడేయిజం వంటి పార్టీలు ఉన్నాయి. లికడ్ పార్టీకి 32 స్థానాలు, షాస్ అడిడ్ పార్టీకి 24 స్థానాలు లభించాయి. ఈ నెల 1న ఇజ్రాయిల్ ఎన్నికలు జరిగాయి. బుధవారం సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇజ్రాయిల్లో గత నాలుగేళ్లలో ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి. ఈ క్రమంలో శుక్రవారం ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో సంప్రదించిన తర్వాత, మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగిస్తానని చెప్పారు.