సమాధి వద్ద ప్రార్థనలను నిర్వహించిన షర్మిల, విజయమ్మ
నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల ఫ్యామిలీ
ఇడుపుల పాయ: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ లోని ఆయన
సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు
రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వీరు వైఎస్ సమాధి
వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరితో పాటు
వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైసీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, బంకా
సోమేశ్వరరెడ్డి, రామగంగిరెడ్డి, శ్రీనివాసులు, ఎస్టేట్ మేనేజర్ భాస్కర్ రాజు
ఉన్నారు. షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు. నిన్న
సాయంత్రం 4.30 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని
గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.