సీతంరాజు సుధాకర్ గెలుపే లక్ష్యం
తొలి ప్రాధాన్యతా ఓటు వైఎస్ఆర్సీపీకే
చిత్తశుద్ధి, అంకిత భావంతో గెలుపునకు కృషి చేయాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : ఉత్తరాంధ్రను తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకునే
చంద్రబాబుకు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా గట్టి బుద్ధి
చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం
ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సీతంరాజు సుధాకర్ ను భారీ మెజారిటీతో
గెలిపించుకోవాలని కోరారు. ఇదే జగనన్న సంకల్పమని, దానిని మనమంతా నెరవేర్చాలని
అన్నారు. నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక
సమావేశంలో సీతంరాజు సుధాకర్ ను పార్టీ ముఖ్య కేడర్ తో పరిచయం చేశారు. అనంతరం
ఎన్నికల ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ
పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి ఓటరును
వ్యక్తిగతంగా కలుసుకొని వారి మద్దతు తీసుకోవాలని వివరించారు. ఈ ఎన్నికలో తొలి
ప్రాధాన్యతా ఓటున్ని సుధాకర్ కు మాత్రమే వేయాలని అన్నారు. మలి ప్రాధాన్యతా
ఓటుగురించి ఆలోచించవద్దని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో గ్రామీణ
ప్రాంతాల్లో మాత్రమే ఆదరణ ఉందని, పట్టభద్రులు, విద్యావంతుల్లో ఆదరణ లేదంటూ
టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
సాధించబోయే విజయంతో తిప్పికొట్టాలని అన్నారు.
పార్టీ పట్టభద్రుల అభ్యర్థి సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ పార్టీ మద్దతుదారులతో
మొదటి ప్రాధాన్యత ఓటును ఒకటి అనే అంకె వేయడం ద్వారా మాత్రమే ఓటింగ్ జరిగేలా
చూడాలని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నిచోట్లా ఎనలేని ఆదరణ
లభిస్తుందని, దాన్ని ఓటుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. స్థానిక
సంస్థల ఎంఎల్సీ అభ్యర్థి నర్తు రామారావు పాల్గొన్న ఈ సమావేశంలో యువజన విభాగం
జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మెంటాడ స్వరూప్ మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ
జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ని మర్యాదపూర్వంగా కలుసుకున్నారు. తనకి
కీలకమైన బాధ్యతలు అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర
తూర్పుకావు, కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ నాయకులు
చింతు రామారావు, శిష్టకరణ కార్పొరేషన్ డైరెక్టర్. సదాశివుని కృష్ణ,
సాసుపల్లి కృష్ణబాబు, ఎంపీటీసీ కేశవరాము, సారవకోట నాయకులు నక్క తులసీదాసు,
నరసన్నపేట నాయకులు సురంగి నర్సింహరావు, ముద్దాడ బాలగోపాల్ నాయుడు, తంగుడు
జోగారావు, రాజశేఖర్, బోబ్బ ఈశ్వరరావు, జేసీఎస్ కన్వీనర్లు, గృహసారధులు
తదితరులు పాల్గొన్నారు.