నాందేడ్ : బీజేపీ, కాంగ్రెస్‌లపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు బీజేపీ పాలించాయి. ఇవి ఏం సాధించాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయని మండిపడ్డారు. ఇది రాజకీయ పోరాటం కాదు. జీవన్మరణ పోరాటమని ఆయన స్పష్టం చేశారు.