* అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో 72 వేల కోట్లు * రైతు
భరోసాగా అందించిన సొమ్ము 31 వేల కోట్లు * అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల
బాగోగుల కోసం 19,674 కోట్లు * ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద
నిలబడాలని రూ. 19,178 కోట్లు * చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా
నిలబడేందుకు రూ. 14,129 కోట్లు * అక్కచెల్లెమ్మల పిల్లలు చదవాలి, ఎదగాలని
విద్యాదీవె, వసతి దీవెన కింద రూ. 14,913 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి
గుడివాడ : రాష్ట్ర సర్కార్ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని, ఏకంగా ఊర్లు
కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అధికారంలోకి
వస్తే ఉచితంగా టిక్కడో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చాం. ప్రతీ
లబ్ధిదారునికి రూ. 7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం. అక్కచెల్లెమ్మల చేతిలో రూ.
6 నుంచి 15 లక్షల దాకా ఆస్తి పెట్టాం. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా
లబ్ధిదారులకు ఒక్క రూపాయితో ఇస్తామని చెప్పాం. లేవుట్ 257 ఎకరాల స్థలం
సేకరించి ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం
చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది.
గుడివాడలో మొత్తంగా 13,145 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 8,912
టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 ఇళ్లు, కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. 16,240
కుటుంబాలు ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే
కాలనీలో నివాసం ఉండబోతోంది. రూ. 800 కోట్ల రూపాయలతో 8,912 ఇళ్లు ఈరోజు కట్టడమే
కాకుండా కట్టిన ఇళ్లను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. 178
ఎకరాల్లో 7,728 ఇళ్ల స్థలాలను, ఇళ్లులేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు
ఇళ్లస్థలాలు కూడా ఇచ్చాం. ప్రతి లబ్ధిదారుకి 1.1 సెంటు ఇచ్చాం. 7 లక్షల
రూపాయలు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. జూలై 8వ తేదీన 8,859 ఇళ్ల
పట్టాలకు అదనంగా మరో 4,200 ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబం
కూడా బాగుపడాలనే బాధ్యతతో అడుగులు వేస్తున్నాం. బాబు పాలనకు భిన్నంగా పేదల
ప్రభుత్వంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి చిత్తశుద్ధితో అడుగులు
వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000
ఇళ్లపట్టాలివ్వడం జరిగింది. ఇప్పటికే 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మనం
నిర్మిస్తున్న జగనన్న కాలనీలు 17,000.. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000.
అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.2.5 లక్షల నుంచి
రూ.10 లక్షల దాకా ఉంటుంది. మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ 30,60,000 ఇళ్ల
పట్టాల మీద 75,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్కచెల్లెమ్మలకు అందజేస్తున్నాం.
ఒక్కో ఇంటిని 2.70 లక్షలతో ఇంటిని కడుతున్నాం. డ్రెయిన్లు, రోడ్లు, ఇన్
ఫ్రాస్ట్రక్చర్కు లక్ష ఖర్చు.స్థలం విలువ 6 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల
దాకా కూడా పోతుందని చెప్పడానికి గర్వ పడుతున్నా. ఇళ్ల మహాయజ్ఞం ద్వారా 2 – 3
లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. దేవుడు
నాకిచ్చిన అవకాశానికి ఇంతకన్నా సంతోషం ఉంటుందా. కొంత మందికి ఈర్ష్య ద్వేషం
ఎక్కువయ్యాయి. నిరుపేదలకు నివాసం ఉండే 300 చ.అ. ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు
అడుగుకు 2వేలు. ఒక్కో ప్లాట్ కు దాదాపు 5.75 లక్షలు కట్టడానికి, మౌలిక
సదుపాయాలకు మరో లక్ష. 300 అడుగులు 6.75 లక్షలు ఖర్చయ్యే ప్లాట్ కు కేంద్రం
1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం 1.5 లక్ష ఇస్తోంది. మిగిలిన 3 లక్షల రూపాయలు
చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా 3 వేలు 20
ఏళ్లపాటు పేదవాడు కడుతూ పోవాలి. పేదవాడు 300 అడుగుల ఇంటిని సొంతం
చేసుకొనేందుకు 7.20 లక్షలు జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన
టిడ్కో పథకం. చంద్రబాబు హయాంలో నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా
ఇచ్చింది అంతకన్నా లేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300
చ.అ.లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 1,43,600 ఇళ్లు. అన్ని హక్కులతో ఫ్రీ
రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. వీటి విలువ 6.75 లక్షలు. వీటిని ఒక్క రూపాయికే
ఇస్తున్నాం. 365 చదరపు అడుగలకి సంబంధించి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు
కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న 3 లక్షల సబ్సిడీకి అదనంగా 365 చ.అ.
వాటికి 50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత 3 లక్షలు ఇవ్వడమే
కాకుండా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం లక్ష, మరో 25 వేలు కలిపి ప్రతి పేద వాడికి
4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. 430 చ.అ. తీసుకున్న ప్రతి పేద వాడికీ 3
లక్షలు కాకుండా, డిపాజిట్ లక్ష నుంచి 50 వేలకు తగ్గించాం. రూ. 4.50 లక్షల
సబ్సిడీ ఇస్తున్నాం. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ప్రభుత్వం
16,601 కోట్లు ఖర్చు భరిస్తోంది. ఇది వాస్తవం. అయితే, ఇందులో చంద్రబాబు
చేసింది ఏమిటి అని అడుగుతున్నా. గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు. తాను
చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమిటి?. నాలుగేళ్లలో
మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది. ఆలోచన చేయాలి. మరి ఇదే
పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు ప్రతి ఒక్కరూ
ఆలోచన చేయాలి.బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. అమరావతిలో పేదలకు
ఇళ్లపట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని ఏకంగా కోర్టుల్లో
కూడా నిస్సిగ్గుగా వాదించారు. అదే అమరావతిలో 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు
సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇదే పనిని ఈ బాబు
ఎందుకు చేయలేదని ఆలోచన చేయాలి. ఈ నాలుగేళ్లు సంవత్సరాల కాలంలో 2.16 లక్షల
కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా
వెళ్తున్నాయి. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో 72 వేల
కోట్లు ఇవ్వగలిగాం. రైతు భరోసాగా అందించిన సొమ్ము 31 వేల కోట్లు ఇవ్వగలిగాం.
అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల బాగోగుల కోసం 19,674 కోట్లు. ఆసరాగా
అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ. 19,178 కోట్లు ఇవ్వగలిగాం.
చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు రూ. 14,129 కోట్లు
ఇవ్వగలిగాం. అక్కచెల్లెమ్మల పిల్లలు చదవాలి, ఎదగాలని విద్యాదీవె, వసతి దీవెన
కింద రూ. 14,913 కోట్లు ఇవ్వగలిగామన్నారు.