విజయవాడ : ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని,రాష్ట్రంలో అక్క చెల్లమ్మలకు
విద్య,ఆర్థిక,సామాజిక,రాజకీయ సాధికారత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్
తపిస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ
కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు మహిళలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే
చట్టం చేశామని,అలాగే నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం
ఇవ్వాలని చట్టం చేశామని సిఎం వెళ్లడించారని చెప్పారు. వివిధ పథకాల ద్వారా
ఏకంగా రూ.2.25 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అధించిందని ఏలూరు జిల్లా దెందులూరులో
జరిగిన సభలో ముఖ్యమంత్రి పే ర్కొన్నారని వెల్లడించారు. 2019 మార్చి 31 న
జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ముడోవ విడత వైఎస్ఆర్ ఆసరా
పథకంద్వారా రూ.6,419 కోట్లు విడుదల చేశారని చెప్పారు.
పనుల ప్రారంభిస్తే అదనపు రాయితీలు : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)
కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలను సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి
తీసుకోచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీ బర్డ్ పేరిట ప్రత్యేక ప్రొత్సహకాలు
ప్రకటించిందని చెప్పారు. 10 శాతం స్టాంప్ డ్యూటి,ల్యాండ్ కన్వర్షన్ చార్జీలు
తిరిగి చెల్లించడం,ఇన్ఫ్రా వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు చెల్లించడం
లాంటి ప్రోత్సహకాలను ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.