అమరావతి : సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను మంగళవారం హైదరాబాద్ లో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల ఇరువురు సీనియర్ నటులు స్వర్గస్థులయ్యారు. దీంతో వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నటులను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోవడం పై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.