లండన్ : బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బారీ గార్డినర్, ఆ దేశానికి చెందిన
దివంగత రంగస్థల డైరెక్టర్ పీటర్ బ్రూక్లకు లండన్లోని ఇండియా హౌస్లో
శుక్రవారం పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకి
ప్రాతినిథ్యం వహిస్తున్న గార్డినర్ చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా భారత
ప్రభుత్వం 2020లో పద్మశ్రీని ప్రకటించింది. థియేటర్ డైరెక్టర్ పీటర్
బ్రూక్ మహాభారతం పురాణ అనుసరణ ‘లె మహాభారత్’ నాటకంతో ప్రసిద్ధి చెందారు.
ఈయనకు 2021 సంవత్సరంలో కళా రంగానికి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. అప్పట్లో
కొవిడ్ కారణంగా వీరిద్దరూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు
అందుకోలేకపోయారు. పీటర్ బ్రూక్ 94 ఏళ్ల వయసులో గతేడాది చనిపోయారు. దీంతో ఆయన
కుమారుడు సైమన్ బ్రూక్ అవార్డు అందుకున్నారు.