సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా
అమరావతి : సోమవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో
పర్యటించనున్నారు. విజయవాడ వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి
పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.45
గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియంకు చేరుకుంటారు. 5.45 – 7.15 గంటల వరకు
ఇఫ్తార్ విందులో పాల్గొని అనంతరం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లి నివాసానికి
చేరుకుంటారు.
సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా : ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి రేపటి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 26కి
వాయిదా వేసినట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు. 26న అనంతపురం జిల్లా నార్పలలో
సీఎం పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఐదోసారి జిల్లాకు సీఎం జగన్ : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి
బాధ్యతలు చేపట్టాక ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఐదోసారి వస్తున్నారు. తొలిసారిగా
అనంతపురం జిల్లా కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే
ప్రారంభించారు. ఆ తర్వాత ధర్మవరంలో నేతన్న హస్తం, వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
సందర్భంగా రైతుదినోత్సవం పేరుతో రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడే
ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ ప్రారంభించారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గంలో
వైఎస్సార్ ఉచిత పంటల బీమా విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు శింగనమల
నియోజకవర్గం నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడి
నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి వసతి దీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో
వేయనున్నారు.