ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్
విజయవాడ : గన్నవరం లో శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులు పై ప్రత్యేకించి సి
ఐ కనకారావు ఎస్ ఐ, మహిళా సిబ్బంది పై తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఆధ్వర్యంలో
అల్లరి మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా
ఖండించింది. ఇటీవలి కాలములో కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ఎజెండాలను
ప్రక్కన పెట్టి తీవ్ర వత్తిడి కి లోనై పరోక్షంగా తమ అసహనాన్ని పోలీస్ వారిపై
చూపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి మస్తాన్ ఖాన్ ఆరోపించారు. ప్రత్యేకించి ప్రతిపక్షములో ఉన్న కొంత
మంది నాయకులు తరచూ వారి నాయకులు ఇచ్చేటువంటి సూచనల మేరకు పోలీస్ వారిని
లక్ష్యం గా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, రాజ్యాంగ బద్ధమైన విధులు
నిర్వహించి ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించే పనిలో అహర్నిశలు కష్ట పడే మా పై,
అధికారులపై పరుష పదజాలం తో వ్యాఖ్యలు చేయటం కాకుండా భౌతిక దాడులకు
పాల్పడుతున్న రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారని అన్నారు. ఇక ముందు
ఇటువంటి చర్యలు జరిగితే చట్టబద్ధంగ, న్యాయ బద్దంగా తీవ్రమైన చర్యలు తీసుకోవటం
జరుగుతుందని సంఘం నేతలు హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ
మస్తాన్ ఖాన్, కృష్ణా జిల్లా అధ్యక్షులు జయపాల్, ఎన్ టీ ఆర్ జిల్లా అధ్యక్షులు
సోమయ్య, కృష్ణా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బెనర్జీ బాబు, తదితరులు
పాల్గొన్నారు.