ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తినడంతో శరీర మెటబాలిజమ్ రేటు
వేగంగా పెరుగుతుంది. అధిక థర్మిక్ గుణం కారణంగా ప్రోటీన్ కేలరీలను వేగంగా
బర్న్ చేస్తుంది.
2.ఎక్కువగా నీరు:
శరీరాన్ని నిత్యం హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే ఎక్కువగా నీరు తాగడం ఉత్తమం. నీరు
ఎక్కువగా తాగడంతో శరీరంలోని టాక్సిన్లు సులభంగా బయిటకుపోతాయి. నీరు తాగడంతో
శరీర మెటబాలిజమ్ రేటు పెరుగుతుంది.
3.వ్యాయామాలు:
కష్టం ఎక్కువగా ఉన్న వ్యాయామాలు చేయడంతో శక్తి కోసం శరీరం కార్బోహైడ్రేట్లు
కంటే కొవ్వును వినియోగించాల్సి వస్తుంది. రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడంతో
జీవక్రియల రేటు పెరుగుతుంది.
4.నిల్చొని ఉండండి:
ఎక్కువ సేపు నిలబడి ఉండటంతో శరీర ఎక్కువ కేలరీలను ఖర్చు చేయాల్సి వస్తుంది.
కూర్చొని ఉండటానికి కంటే ఎక్కువ సేపు నిల్చుని ఉండటానికి ప్రయత్నించండి.
5.గ్రీన్ టీ:
రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో కెటాచిన్ అనే
ప్లేవనాయిడ్ ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీర జీవక్రియల రేటును
వేగవంతం చేస్తాయి.
6.స్పైసీ ఫుడ్:
స్పైసీ ఫుడ్ థర్మోజనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను
పెంచుతుంది. దీంతో జీవక్రియల రేటు వేగవంతంగా పెరుగుతుంది. మనం ఆరోగ్యంగా
ఉండవచ్చు.
7.కాఫీ:
కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియల రేటును వేగవంతం
చేయడంలో సహాయపడుతుంది. కొవ్వు వేగంగా కరిగేలా చూస్తుంది.
8.నిద్ర:
నిద్ర లేమి అనేది జీవక్రియలపై వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిద్ర లేమి
కారణంగా జీవక్రియలు మందగించే ప్రమాదం ఉంది. రోజుకు ఎనిమిది గంటల పాటు
నిద్రపోవడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
9.క్యారెట్:
రెగ్యులర్ గా క్యారెట్లు తినడంతో జీవక్రియల రేటు పెరుగుతుంది. లిపిడ్స్,
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ను తగ్గించడంలో క్యారెట్లోని విటమిన్లు
సహాయపడతాయి.