తలనొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు ట్లాబ్లెట్లు
కాకుండా ఈ సహజ పద్దతులను పాటించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
అల్లం:
అల్లం టీ తాగడం లేదా అల్లం, నిమ్మరసం సమాన మోతాదులో కలిపి తాగడంతో తలనొప్పి
నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.
పిప్పర్మెంట్ ఆయిల్:
బాదం నూనెలో రెండు నుంచి మూడు చుక్కల పిప్పర్మెంట్ ఆయిల్ కలిపి తల, మెడ
భాగాల్లో మసాజ్ చేయాలి. తలనొప్పిగా ఉన్న సమయంలో మసాజ్ చేయడంతో నొప్పి
తగ్గుతుంది.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కను పొడిలా తయారు చేయాలి. దీన్ని నీటిలో కలిపి చిక్కని పేస్ట్
తయారు చేయాలి. దీన్ని నెత్తికి, మెడ ప్రాంతంలో రాసుకోవడంతో తలనొప్పి
తగ్గుతుంది.
థైమ్:
తలనొప్పి సమయంలో రెండు నుంచి మూడు చుక్కల థైమ్ ఆయిల్ ను రాసుకోవాలి. ఈ ఆయిల్
ను రాసుకోవడం లేదా సున్నితంగా మసాజ్ చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
హీటింగ్ ప్యాడ్:
తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో హీటింగ్ ప్యాడ్ సహాయపడుతుంది. హీటింగ్ ప్యాడ్
ను తలకు అప్లై చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
లవంగాలు:
లవంగాలును మిక్స్ చేసి చూర్ణం తయారు చేయాలి. తలనొప్పిగా ఉన్న సమయంలో ఈ చూర్ణం
వాసన పీల్చడంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి:
ఒక కప్పు నీటిలో నాలుగైదు తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటిలో
తేనె కలుపుకొని తాగడంతో తలనొప్పి తగ్గుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ క్షణాల్లో తలనొప్పిని తగ్గిస్తుంది. వేడి నీటిలో యాపిల్
సైడర్ వెనిగర్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేయడంతో మైగ్రేన్ నొప్పి కూడా
తగ్గుతుంది.