కాపాడుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే కొన్ని చిట్కాలు పాటించడం
ద్వారా నిగనిగలాడే, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. అవేంటో చూద్దాం..
జుట్టు శుభ్రంగా:
మీ కుదుళ్లు తొందరగా జిడ్డుగా మారడం వల్ల చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి
సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వారు తరచూ తలస్నానం చేయడం మంచిది.
కండిషనర్:
తలస్నానం చేశాక జుట్టు తేమను కోల్పోతుంది. ఇటువంటి సమయంలో కండిషనర్ వాడటం వల్ల
జుట్టుకు తిరిగి తేమను అందించవచ్చు. జుట్టును మృదువుగా ఉంచుకోవచ్చు.
గోరువెచ్చని నూనె:
తలకు నూనె పెట్టుకోవాలంటే గోరువెచ్చని నూనెని ఉపయోగించడం ఉత్తమం. ఇది
కుదుళ్లతో పాటు తలకు తగిన పోషకాలను అందిస్తుంది. జుట్టు సమస్యలను
నివారిస్తుంది.
స్విమ్మింగ్ సమయంలో:
స్విమ్మింగ్ పూల్ వాటర్లో క్లోరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును పాడు
చేస్తుంది. అందువల్ల స్విమ్మింగ్ చేసే సమయంలో తలకు క్యాప్ ధరించడం ఉత్తమం.
జుట్టుకు తగినట్లు:
మీ చర్మం గుణాన్ని అర్థం చేసుకుని సౌందర్య ఉత్పత్తులు ఎలా వాడతారో అలాగే
జుట్టు గుణాన్ని కూడా అర్థం చేసుకోండి. మీ వెంట్రుకలకు తగినట్లు షాంపూ,
కండీషనర్ వంటివి ఉపయోగించండి.
హెయిర్ ప్రోడక్ట్స్:
మీ జుట్టుకు తగిన హెయిర్ ప్రోడక్ట్స్ ఉపయోగించడం చాలా అవసరం. ఏది పడితే అది
వాడటం వల్ల జుట్టు తొందరగా డ్యామేజ్ అవుతుంది.. అందువల్ల బ్యూటిషియన్ సలహా
తీసుకుని ప్రోడక్ట్స్ కొనండి.
షాంపూ:
నేరుగా షాంపూను తలకు పట్టించడం వల్ల ఇది జుట్టును పాడు చేస్తుంది. అందువల్ల
కాస్త నీటిలో షాంపూను కలిపి దానిని వెంట్రుకలకు పట్టించండి. మంచి ఫలితం
ఉంటుంది.
ఆహారం:
ఒత్తైన, నిగనిగలాడే జుట్టు కోసం తినే ఆహారం పైనా శ్రద్ధ పెట్టండి. కోడిగుడ్లు,
పెరుగు, సాల్మన్ ఫిష్, దాల్చినచెక్క, పప్పు ధాన్యాలు, చిలగడ దుంప, కరివేపాకు,
బాదంలో జుట్టు కావాల్సిన పోషకాలు ఉంటాయి.