ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున రుణాలు
రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
గుంటూరు : సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా
నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల
పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి ఆదేశించారు. ఇళ్లపట్టాల పంపిణీ అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణం సాగించేలా
చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం గృహనిర్మాణశాఖపై సీఎం సమీక్షించారు.
సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ
మంత్రి ఆదిమూలపు సురేష్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఆర్డీఏ ప్రాంతంలో
పేదలకు పట్టాల పంపిణీ చేసిన అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు
తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా
కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
రాష్ట్రంలో గృహనిర్మాణాలపైనా సీఎం ఆరా తీశారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ
ఇళ్లు’ కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. గడచిన 45 రోజుల్లో
హౌసింగ్ కోసం రూ.1,085 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ 3.70
లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. 5.01లక్షల ఇళ్లు రూఫ్ లెవల్, ఆపైన
నిర్మాణంలో ఉన్నాయని, త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. మరో
45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బేస్మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే
ఉన్నాయని, వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక,
పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్
దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ల్యాండ్
అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్
కె విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి,
గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె
వి వి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ ఎండీ ఇంతియాజ్, ఏపి టిడ్కో ఎండీ
సీహెచ్ శ్రీధర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ
లక్ష్మీషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.