8 నుంచి పద్దులపై చర్చ!
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ
సమావేశంలో మంత్రులు, చీఫ్ విప్, కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. గవర్నర్
ప్రసంగాన్ని ఇచ్చారు. దీనికి ధన్యవాదాలు తీర్మానం తెలిపే అంశంపై రేపు చర్చ
జరగనుంది. బడ్జెట్, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ అనంతరం
అవసరమైతే మిగిలిన అంశాలపై చర్చ చేపట్టాలని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం
నిర్ణయించింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ
సమావేశంలో ఉపసభాపతి పద్మారావు, మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల
కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్,
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.