బిజెపి పాలిత రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘన * ఏపీసీసీ హ్యూమన్ రైట్స్
విభాగ చైర్మన్ మన్నం రాజశేఖర్, సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ బాలు తుమాటి
విజయవాడ : బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళిత గిరిజన వర్గాలపై దాడులు నానాటికి
పెరిగిపోతున్నాయని ఏపీసీసీ హ్యూమన్ రైట్స్ విభాగ చైర్మన్ మన్నం రాజశేఖర్,
సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ బాలు తుమాటి ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను
నెలకొల్పాసిన కేంద్ర హోం మంత్రి వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను పడగొట్టి,
విడగొట్టి బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు.
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై ప్రధాని మౌనం హింసకు అనుకూలం
అనేట్లుందని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో మణిపూర్ హింసాత్మక
ఘటనలపై ప్రధాని ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ విపక్షాలు కలిసి డిమాండ్
చేయగా ప్రధాని కేవలం 36 సెకండ్లు మాత్రమే మాట్లాడి మొసలి కన్నీరు కార్చిన
వైనంను దేశమంతా చూసి నిర్వేరపొయిందన్నారు. మోడీ పోకడను దేశ ప్రజలు
అసహ్యించుకొంటున్నారని, హింసను ఆపకపోవడం అంటే హింసను ప్రోత్సహించటమేనని
బిజెపి పార్టీ ప్రధాన మంత్రి, హోం మంత్రికి అయన హితవు పలికారు. బిజెపి పాలిత
రాష్ట్రాల్లో మానవ హక్కులు ఉల్లంఘనకు సంబంధించి హై పవర్ హ్యూమన్ రైట్స్
విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దాడి
చేస్తున్నవారు బలమైన వర్గం, ఓట్లు శాతం ఉన్నవారైతే ఆ దాడిని ఖండించక మౌనం
వహించడం ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తులకు తగదని గ్రహించాలని, బాధితులకు అండగా
కాంగ్రెస్ పార్టీ వుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.