సుగంధద్రవ్యంగా వినియోగిస్తారు. వాముతో పాటు వాము ఆకులలో కూడా అనేక
ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.
* జీర్ణక్రియ:
వాము ఆకులు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలకు
చెక్ పెడతాయి. వాము ఆకులను రెగ్యులర్ తీసుకోవడంతో అజీర్తి, కడుపు నొప్పి,
మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
* వ్యాధినిరోధకశక్తి:
ప్రతిరోజూ వాము ఆకులను తీసుకోవడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు
నుంచి రక్షణ లభిస్తుంది. ఈ ఆకులను తీసుకోవడంతో శరీరానికి వివిధ ఇన్ఫెక్షన్లతో
పోరాడే శక్తి లభిస్తుంది.
* నోటి సమస్య:
చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి వాము
ఆకులు మంచి ఔషధం. వాము ఆకులు అద్భుతమైన మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తాయి. నోటి
ఆరోగ్యాన్ని పెంచుతుంది.
* శ్వాస వ్యవస్థ:
శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా మార్చడంలో వాము ఆకు సహాయపడుతుంది. వాము ఆకును
తీసుకోవడంతో శ్లేష్మం తొలగుతుంది. వాము ఆకు ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది.
* మధుమేహం:
వాము ఆకు, గింజలు మధుమేహం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. వేపాకుల పొడిని,
వాము గింజలను, గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు
తగ్గుతాయి.
* మైగ్రేన్:
అజ్వైన్ గింజలు, ఆకుల వాసన చూడటంతో మైగ్రేన్ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఇది తలకు సంబంధించిన ఇతర సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
* ఆర్థరైటిస్:
ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో వాము ఆకులు సహాయపడతాయి. వాము నూనె సైతం
ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేయడంతో ఆర్థరైటిస్ నొప్పి
తగ్గుతుంది.
* డయేరియా:
డయేరియా నుంచి ఉపశమనం అందించడంలో వాము ఆకులు సహాయపడతాయి. వాము ఆకును, గింజలను
ఉడకబెట్టి ఆ నీటిని తాగడంతో విరేచనాలు తగ్గుతాయి.