జీవనశైలి, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం కారణంగా వెన్నునొప్పి సమస్యలు
అధికమవుతాయి. ఈ సమస్య నుంచి బయిట పడాలంటే వీటిని తినడం ఉత్తమం.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ లో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి
వెన్నునొప్పిని తగ్గిస్తాయి. ఎక్కువగా వేడి చేస్తే ఇందులోని పోషకాలు కోల్పోయే
ప్రమాదం ఉంది.
ఫ్యాటీ ఫిష్:
సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్‌ల లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా
ఉంటాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వెన్ను
నొప్పిని తగ్గిస్తాయి.
నట్స్:
రెగ్యులర్ గా నట్స్ తినడంతో వెన్నునొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా గుమ్మడి
గింజలు, వాల్ నట్స్ తినడం ఉత్తమం. వీటిలో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
ఎముకలను బలంగా మార్చుతాయి. వెన్నునొప్పిని తగ్గిస్తాయి.
బ్రోకలీ:
క్రూసిఫెరస్ కూరగాయలు తినడంతో శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు
పుష్కలంగా అందుతాయి. బ్రోకలి, క్యాబేజీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ
ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపు నుంచి ఉపశమనం అందిస్తాయి.
పప్పులు:
వివిధ రకాల పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడంతో శరీరానికి కావాల్సిన
ప్లేవనాయిడ్స్ సులభంగా అందుతాయి. ఇవి శక్తిని అందించి వాపును నిరోధిస్తాయి.
వీటిని తినడంతో వెన్ను నొప్పి తగ్గుతుంది.
పండ్లు:
పండ్లు తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి. ముఖ్యంగా
యాపిల్స్, పైనాపిల్, బెర్రీలు, చెర్రీస్, ద్రాక్ష తినడంతో వాపు నుంచి ఉపశమనం
లభిస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గ్రీన్ టీ:
దీర్ఘకాలికంగా ఉన్న వెన్నునొప్పిని తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది.
గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను, వాపును తగ్గిస్తాయి.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ తినడంతో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. డార్క్
చాక్లెట్లో ఉన్న కోకో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.