గుంటూరు : రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ,
ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ
చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా
ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి
రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వందల క్రితం
విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వందేళ్ల కాలంలో 11 మెడికల్
కాలేజీలు ఏర్పాటు చేస్తే. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్
కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు
పెడుతున్నాం. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్ర అని మంత్రి రజిని
అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే
దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చాం. సీఎం
జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్వాతంత్రం
వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం
భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదని, వైద్య ఆరోగ్యశాఖలో
నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేశామని మంత్రి విడదల రజిని తెలిపారు.