పేరుకుపోయి అంద విహీనంగా తయారు అవుతున్నారు. అయితే అలాంటి వారు కొన్నిచిట్కాల
ద్వారా పొట్టను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిఫల చూర్ణం:
మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ చిట్కా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రాత్రి
పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే కొలెస్ట్రాల్
కరిగిపోతుంది.
ఉసిరి రసం:
రోజూ ఉదయాన్నే పరగడపున ఉసిరి రసాన్ని తాగడం వల్ల అధిక బరువు సులభంగా
తగ్గుతారు.
మెంతులు:
రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను
పరగడుపున తింటే బరువు తగ్గుతారు.
నీరు:
నీటిని ఎక్కువగా తీసుకుంటూ..ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచె ఎక్కువ
సార్లు తీసుకోవాలి.
ఉలవలు:
నల్ల ఉలవలను ఉడికించి అందులో సైంధవ లవణం కలిపి తీసుకోవడం వల్ల ఒంట్లోని కొవ్వు
కరిగిపోతుంది.
కూరగాయలు:
ఎక్కువగా ఫైబర్ ఫుడ్, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం
ఉంటుంది.