సమయంలో ఈ డ్రింక్స్ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
ఫ్రూట్ స్మూతీస్:
పండ్లతో తయారు చేసే స్మూతీల్లో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి
రక్తంలో చక్కెర లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. అలాగే ఈ స్మూతీల తయారీలో
వాడే గింజలు, పండ్లు తొందరగా జీర్ణమై తక్షణ శక్తిని అందిస్తాయి.
హెర్బల్ టీ:
యాలకులు, అల్లం, పసుపు, హైబిస్కస్ వంటి హెర్బల్ టీలతో అలసట తొందరగా
దూరమవుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర జీవక్రియ రేటును పెంచడమే
కాకుండా రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి.
దానిమ్మ జ్యూస్:
దానిమ్మ జ్యూస్ విటమిన్ సి, కె, ఇతో పాటు ఐరన్, పొటాషియం, జింక్ వంటి ఆవశ్యక
మూలాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడమే కాకుండా రక్తంలో
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి.
పుచ్చకాయ జ్యూస్:
పుచ్చకాయ జ్యూస్ విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి తేమ, వేడి సమయంలో
శరీరానికి కావాల్సిన లవణాల్ని అందించి శక్తిని సమకూరుస్తాయి.
కొబ్బరినీళ్లు:
అలసటతో బాధపడేవారికి తక్షణ శక్తి కావాలంటే కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
వీటిలోని పోషకాలు రక్తంలో చక్కెర లెవెల్స్ ను తగ్గించి శక్తిని రెట్టింపు
చేస్తాయి.
కాఫీ:
కాఫీ గింజల్లోని కెఫిన్ మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేసి ఉల్లాసాన్ని
అందించడంలో సహాయపడుతుంది. అలసటను దూరం చేస్తుంది.
నిమ్మరసం:
అలసటగా ఉన్నవారు తక్షణ శక్తి పొందాలంటే తాగాల్సిన మరో డ్రింక్ నిమ్మరసం. ఇది
మిమ్మల్ని ఉల్లాసంగా మారుస్తుంది. ఇందులోని పెక్టిన్ అనే సమ్మేళనం ఆకలిని
తగ్గించి బరువు నియంత్రణలో ఉంచుతుంది.
చెరకు రసం:
చెరకు రసం రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందులోని ఐరన్, మాంగనీస్,
కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు మీకు తక్షణ శక్తిని అందిస్తాయి.