ప్రారంభించనున్న ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా మంత్రులు, కలెక్టర్
నగరి : ఈనెల 28న జగనన్న విద్యా దీవెన పథకాన్ని చిత్తూరు జిల్లా నగరి నుండి
లాంఛనంగా గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రారంభించనున్న
నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం డిప్యూటీ సీఎం కే. నారాయణస్వామి, రాష్ట్ర అటవీ,
విద్యుత్, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ
మంత్రి ఆర్కే రోజా, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ముఖ్యమంత్రి
పర్యటనల సలహాదారు, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్,
ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి, తదితరులు పరిశీలించారు. వీరితో పాటు జిల్లా జాయింట్
కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఎం ఎల్ సి సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు
శాసనసభ్యులు ఆదిమూలం, డిఆర్ఓ ఎన్. రాజశేఖర్, టిటిడి పాలకమండలి సభ్యులు పోకల
అశోక్ కుమార్, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ శాంతి, జడ్పీ సిఈఓ
ప్రభాకర్ రెడ్డి, ఆర్డిఓ నగరి సుజన, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నగరి పర్యటన విజయ వంతానికి
జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు సమర్థవంతంగా చేయడం జరుగుతున్నదన్నారు. ఈ
సందర్భంగా హెలిప్యాడ్, బహిరంగ సభ వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని
తెలిపారు.
అధికారులి విధులను సమర్థవంతంగా నిర్వహించండి : చిత్తూరు జిల్లా కలెక్టర్
ఎస్.షన్మోహన్
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నగరి పర్యటన సందర్భంగా అధి కారులకు
కేటాయించిన విధులను సమర్థ వంతంగానిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్
పేర్కొన్నారు. ఈనెల 28నజగనన్న విద్యా దీవెన కార్య క్రమంను నగరి నుండి లాంఛనంగా
ప్రారంభించనున్న నేపథ్యంలో బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్ల ను శనివారం
రాష్ట్ర సాంస్కృతిక యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా,ముఖ్యమంత్రి
పర్యటనల సలహాదారు, ఎమ్మెల్సీ తలశీలరఘురాం, ఎస్.పి వై.రిషాంత్ రెడ్డి తో కలిసి
జిల్లా కలెక్టర్ పరిశీలించి అనంతరం జిల్లా అధికారులు, ఇతర అధికారులతో
సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరిలో ముఖ్య మంత్రి
పర్యటనలో భాగంగా వివిధ శాఖల వారీగా కేటాయించిన విధులను సమర్థ వంతంగా బాధ్యత తో
నిర్వర్తించాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని సూచించారు. ఈ
సమావేశంలో జడ్పీ సీఈఓప్రభాకర్ రెడ్డి,సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్
అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష,డ్వామా పిడి గంగా భవాని,డిపిఓ లక్ష్మి,
ఆర్డీఓ నగరి సుజన సంబంధిత శాఖల అధికారులు డివిజన్ మండల స్థాయి అధికారులు
పాల్గొన్నారు.